ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-FSSAI నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ఈ సంస్థల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రిన్సిపల్ మేనేజర్, జాయింట్ డైరెక్టర్, మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ మేనేజర్ లాంటి వివిధ రకాల 38 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దరఖాస్తుల ఆహ్వాన ప్రక్రియ 2021 ఏప్రిల్ 16 నుంచి 2021 మే 15వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ ఖాళీలకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-FSSAI అధికారిక వెబ్‌సైట్ https://fssai.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లోనే ఈ ఖాళీలకు దరఖాస్తు చేయాలి. పై తెలిపిన ఉద్యోగాలకు వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ క్లుప్తంగా చదివి సంబంధిత ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి ఈ నోటిఫికేషన్లో తెలియజేసిన చిరునామాకు 2021 మే 31వ తేదీ లోగా చేరాలి. దరఖాస్తు పంపించాల్సిన అడ్రస్:
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Assistant Director (Recruitment),
Human Resource Division,
Room No. 407,
Food Safety and Standard Authority of India,
FDA Bhwan, Kotla Road, New Delhi- 110002.






























