Ap Politics: ఏపీలో కూటమే ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నేతలపై కార్యకర్తలపై దారుణాలు అరాచకాలను జరుపుతున్నారు అయితే తాజాగా వైసిపి నేతలపై కూడా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు అయితే తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఇలా జోగి రాజీవ్ ను అధికారులు అరెస్టు చేయడంతో ఈ ఘటనపై వైసిపి నేత పేర్ని నాని స్పందించారు. రాజీవ్ అరెస్టును మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను అరెస్టు చేయడానికి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రశ్నించే గొంతును నొక్కేయడం తప్ప ఇంకేమీ చేయలేదని తెలిపారు.
కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చే 60 రోజులు అవుతున్న ఇప్పటివరకు ఒక్క పథకం కూడా అమలు చేయకుండా వైసిపి నేతలపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక అగ్రిగోల్డ్ భూములు తమ పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారు అన్న ఉద్దేశంతోనే ఏసీబీ అధికారులు నేడు ఉదయం నుంచి జోగి రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.
న్యాయపోరాటం ఆపం..
ఈ విషయం గురించి పేర్ని నాని మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ ఆస్తులు అన్ని జప్తులో ఉన్నాయి. ప్రభుత్వం జీవో లు ఇచ్చింది. జోగి రమేష్ కుమారుడు కొనుగోలు చేసిన స్థలంకు సరిహద్దుల్లోకూడా అగ్రిగోల్డ్ ఆస్తులు లేవు. పేపర్ ప్రకటన ఇచ్చి ఆ భూములను కొనుగోలు చేశారు భూములు చట్ట ప్రకారమే లావాదేవీలు జరిగాయి తప్ప చట్ట వ్యతిరేకంగా కాదని తెలిపారు రాజకీయంగా వారిని ఎదుర్కోలేక ఇలా అక్రమంగా వారిపై దాడులకు పాల్పడుతున్నారు అంటూ నాని చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నీకు చేతనైంది చేసుకో మేము మా పోరాటం ఆపము చివరికి న్యాయమే గెలుస్తుంది అంటూ ఈయన చంద్రబాబు తీరుపై మండిపడ్డారు.





























