RK Roja: ఆర్కే రోజా పరిచయం అవసరం లేని పేరు సినీ నటిగా రాజకీయ నాయకురాలుగా ఎంతో సపరిచితం. వైఎస్ఆర్సిపి పార్టీలో మాజీ మంత్రిగా వ్యవహరించినటువంటి ఈమె ఇటీవల ఎన్నికలలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. అయితే ఇలా ఓటమి పాలైన ఈమె బీజేపీలోకి వెళ్తారని అందరూ భావించినప్పటికీ ఆ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు..

ఇకపోతే తాజాగా నేడు వైయస్సార్ 75వ జయంతి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది వైయస్సార్ ను గుర్తు చేసుకుంటూ చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ అభిమానులు కార్యకర్తలు ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా సైతం ట్విట్టర్ వేదికగా వైయస్సార్ జయంతి వేడుకలను పురస్కరించుకొని చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా రోజా ట్విట్టర్ వేదికగా వైయస్సార్ గురించి తెలియజేస్తూ.. రోడ్డు ప్రమాదాలలో మరణాలను వీలైనంత తక్కువ చేయడానికి 108 అంబులెన్స్‌లను తీసుకువచ్చారనీ రోజా తెలిపారు.ఈ 108 అంబులెన్స్ ఆవిష్కరణ రాష్ట్ర వైద్య చరిత్రలోనే ఓ సంచలనంగా నిలిచిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గుండెల్లో ఉన్నారు…
ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఎంతోమందికి పునర్జన్మ ప్రసాధించిన దేవుడు వైయస్ఆర్ గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. వైయస్సార్ గారు చేసిన ఎన్నో మంచి పనులను మనం మర్చిపోకూడదని తెలిపారు.. వైయస్సార్ మన మధ్య లేకపోయినా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయులై ఉంటారంటూ ఈ సందర్భంగా రోజా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.





























