అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి (68) ఈరోజు కన్నుమూసారు. గత 15 రోజులుగా అయన కరోనాతో పోరాడుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. సబ్బం హరికి ఏప్రిల్ 15న కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. మొదట్లో హోం క్వారంటైన్ లో ఉన్న ఆయన ఆ తరువాత విశాఖలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు.

అక్కడి వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే నేడు పరీస్థితి విషమించడంతో అయన మరణించారు. సబ్బం హరి విశాఖపట్నం మేయర్ గా కూడా పని చేసారు. రోజుకు ఒక నాయకుడు కరోనా ధాటికి ప్రాణాలు విడుస్తున్నారు నిన్న పెద్దాపురం మాజి ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రామారావు మరణించిన విషయం తెలిసిందే. ఈరోజు సబ్బం హరి కరోనాకి బలైపోవడం ఆందోళన కలిగిస్తోంది.































