అతను ఒక మాజీమంత్రి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అతనికి ఉంది. కానీ ఆ ప్రజాస్వామ్యాన్ని అతడు తుంగలో తొక్కాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకొని ఆరోసారి పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇక అంతా సవ్యంగా జరుగుతుంది పెళ్లి తంతు కార్యక్రమమే మిగిలి ఉండగా.. అతనికి ఊహించని రీతిలో తన మూడో భార్య భారీ ట్విస్ట్ ఇచ్చింది. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి పోలీసులు వచ్చి సదరు మాజీ మంత్రిని అరెస్టు చేశారు. ఇలాంటి వింత ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలో రాష్ట్ర మాజీ మంత్రి చౌదరి బషీర్ ఇదివరకే ఐదు పెళ్లిళ్లు చేసుకొని ఆరోసారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.అయితే తన ఆరోసారి పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసిన మూడవ భార్య నగ్మా అతని పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బషీర్ మహిళల పట్ల ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని మానసికంగా శారీరకంగా ఎంతో వేధిస్తాడని అతడి మూడో భార్య
నగ్మా మంటోలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలోనే తనకు బషీర్ కి 2012లో పెళ్లి జరిగిందనిపెళ్లి తర్వాత బషీర్ తనను ఎంతో మానసికంగా శారీరకంగా హింసించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తన మరో పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలియడంతో ఈ విషయంపై తన నిలదీయడానికి వెళ్లిన తనకి ఎంతో చిత్రహింసలు పెట్టడమే కాకుండా త్రిపుల్ తలాక్ చెబుతూ విడాకులిచ్చాడని ఇంటి నుంచి బయటకు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ విధంగా మాజీ మంత్రి బషీర్ మూడవ భార్య నగ్మా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతని ఆరవ వివాహాన్ని అడ్డుకోవడమే కాకుండా ముస్లిం మహిళా వివాహ చట్టం కింద పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఇకపోతే బషీర్ మాయావతి ప్రభుత్వంలో ఇతను మంత్రిగా పని చేసినట్లు పోలీసులు తెలిపారు.





























