కరోనా కారణం వల్ల చాలా మంది నిరుద్యోగులుగా మారారు. ఈ క్రమంలోనే ఏదైనా చిన్న పనైనా సరే చేయాలని ఆలోచనలో చాలా మంది యువతీ యువకులు ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఎంతోమంది సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది యువతీ యువకులు వారి మాయలోపడి దారుణంగా మోసపోతున్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విధమైనటువంటి మోసపూరిత ఉద్యోగాలను ఏ విధంగా గుర్తించాలి.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

మనకు ఆ ఉద్యోగం చేయడానికి ఎలాంటి అర్హతలు లేకున్నా ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పే ఈ విషయాన్ని నమ్మకూడదు. ప్రస్తుత కాలంలో ఇంటి నుంచి ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటూ అధిక మొత్తంలో డబ్బును ఆశ చూపించే ఉద్యోగాలను నమ్మకూడదు. మనకు అర్హత లేకుండా ఈ విధంగా అధిక మొత్తంలో జీతం చెల్లించి ఉద్యోగం చేయించుకోవాల్సిన అవసరం వారికి ఏముంటుంది అనే ఆలోచన చేయాలి.
ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు, అంటూ చాలామంది పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మొబైల్ నెంబర్,ఇ–మెయిళ్ళు ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని అవతల వ్యక్తికి పంపించకూడదు. మీరు చేసే ఏ చిన్న ఉద్యోగమైనా చట్టపరమైన ఒప్పందంపై సంతకం చేయమని కోరాలి.ఈ విధంగా పలు జాగ్రత్తలు తీసుకునప్పుడే మనం ఎటువంటి మోసగాళ్ల చేతిలో మోసపోకుండా మన వ్యక్తిగత డేటాను, ఫోటోలు ఇతరులకు వెళ్లకుండా.. వారి నుంచి వచ్చే బెదిరింపులకు లొంగకుండా జాగ్రత్త పడవచ్చు.































