AP: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. ఇలా కూటమి అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున వరాలు కురిపించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా అమలు అవుతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ పథకాన్ని ప్రకటించడంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే అదే అస్త్రాన్ని కూటమి కూడా ఉపయోగించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించడమే కూడా కూటమి గెలుపుకు కారణమని చెప్పాలి. ఇంకా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు కల్పిస్తున్నారనే విషయంపై గందరగోళం ఏర్పడింది.
రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ఈ విషయంపై ఇదివరకే మాట్లాడుతూ తెలంగాణ కర్ణాటకలో పరిస్థితులను అక్కడ తలెత్తుతున్న సమస్యలను గుర్తించి ఏపీలో అలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్న తర్వాతనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు.. అయితే ఉచిత బస్సు ప్రయాణం పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
జూలై 1 నుంచి..
ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇచ్చిన హామీలలో ఒకటైన ఉచిత బస్సు సౌకర్యాన్ని జులై 1 నుంచి ఏపీలో అమలులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి అధికారులతో చర్చించారని త్వరలోనే ఈ విషయం గురించి ప్రభుత్వం అధికారికంగా తెలియజేయబోతున్నారని తెలుస్తోంది.





























