కరోనా మహమ్మారి ధాటికి ప్రజలు థియేటర్ల పేరు చెబితేనే భయపడిపోతున్నారు. థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులు ఇప్పట్లో సినిమాలు చూసే పరిస్థితులు కనిపించడం లేదు. 50 శాతం ఆక్యుపెన్సీతో కేంద్రం థియేటర్లకు అనుమతులిచ్చినా దేశంలోని ప్రజలు ఓటీటీ ద్వారా, యూట్యూబ్ ద్వారా దొరికే ఎంటర్టైన్మెంట్ నే ఇష్టపడుతున్నారు. అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్, ఆహా, జీ5 లాంటీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది.
ఓటీటీల ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్ లు, టాక్ షోలను వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే ఓటీటీ ఫ్లాట్ ఫాం ద్వారా సినిమాలు, వీడియోలు, వెబ్ సిరీస్ లు చూడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. ఎవరైతే సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారో వారు మాత్రమే ఆన్ లైన్ లో వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది స్నేహితుల దగ్గరో, బంధువుల దగ్గరో నెట్ ఫ్లిక్స్, ఇతర ఓటీటీ యాప్స్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తీసుకొని సినిమాలను వీక్షిస్తూ ఉంటారు.
అయితే నెట్‌ఫ్లిక్స్ తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా సినిమాలు, ఇతర ప్రోగ్రామ్ లు చూడాలనుకునే వారి కోసం అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ 5, 6 డబ్బులు చెల్లించకుండానే ఉచితంగా వీడియోలను చూసే అవకాశాన్ని నెట్ ఫ్లిక్స్ కల్పిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ ఫెస్ట్ పేరుతో ఈ ఆఫర్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ రెండు రోజుల తరువాత మాత్రం ఉచితంగా వీక్షించడానికి వీలు కాదు.
ఓటీటీలు ఒక్కొక్కటి ఒక్కో విధంగా ప్రేక్షకుల నుంచి ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఈ ఛార్జీలు 200 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో ఉండటం గమనార్హం. కొన్ని ఓటీటీలు నెలవారీ ఛార్జీలను వసూలు చేస్తుంటే మరికొన్ని మాత్రం సంవత్సరానికి వసూలు చేస్తుండటం గమనార్హం.