Gali Janaardhan Reddy Son: సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉందనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో మంది రాజకీయాలలో ఉన్న వారు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి వారి సత్తా చాటుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన వారసుడు కిరీటి రెడ్డి త్వరలోనే వెండితెర అరంగ్రేటం చేయనున్నట్లు తెలుస్తోంది.

గాలి కిరీటి రెడ్డికి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించడమే తన లక్ష్యంగా ఉండటంతో ఇప్పటికే యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి తెలియజేస్తూ త్వరలోనే గాలి కిరీటిరెడ్డి వెండితెర అరంగ్రేటం చేయనున్నట్లు ప్రకటించారు.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన జాకీ సినిమా ఇన్స్పిరేషన్ తో కిరీటి రెడ్డి ఇండస్ట్రీ లోకి రావాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈయనను ఎంతో గ్రాండ్ గా ఇండస్ట్రీలోకి లాంఛ్ చేయడానికి సాయి కొర్రపాటి ఒక అద్భుతమైన కథను కూడా సిద్ధం చేసి గాలి జనార్దన్ రెడ్డి తనయుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
కన్నడ, తెలుగు, తమిళ భాషలలో…
కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో ఏకకాలంలో కన్నడ తెలుగు తమిళ భాషలలో తెరకెక్కనుంది. ఇకపోతే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో తెలుగులో కూడా చాలామంది దర్శక నిర్మాతలతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇలా తన తనయుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం అన్ని శిక్షణలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే మరొక రాజకీయ వారసుడు ఇండస్ట్రీలోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.































