వంట గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. హైదరాబాద్ లో 14.2 కేజీల ఎల్ పిజి గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా 207 రూపాయిలు దిగివచింది.. దీనితో రూ. 589.50 నుంచి ప్రారంభం కానుంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ కూడా 336 రూపాయిలు తగ్గి 988 రూపాయిల నుంచి ప్రారంభం కానుంది.

నెలవారీ సమీక్షల్లో ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయి. అయితే ఈ ధరలు మే 1 తేదీ నుంచే అమలుకు కానున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ లోని ఎల్ పిజి సిలిండర్ ధర 744 రూపాయిల నుంచి 581 రూపాయలకు దిగివచ్చింది. మరో మన వాణిజ్య నగరం ముంబై లో అయితే 714.50 రూపాయిల నుంచి 579 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఇక కోల్ కతా లో సిలిండర్ ధర 190 రూపాయిలు తగ్గి 584.50 రూపాయలుగా కాగా, చెన్నై లో 569 రూపాయలకు సిలిండర్ ధర పడిపోయింది.





























