Gautham: తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న గౌతమ్.. గర్వంగా ఉందంటూ నమ్రత పోస్ట్!

0
27

Gautham: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడమే కాకుండా గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా మహేష్ బాబు తెరపై మాత్రమే కాకుండా తెర వెనుక కూడా హీరో అని నిరూపించుకున్నారు. ఇక ఈయన ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించిన దేవుడు అని చెప్పాలి.ఇలా మానవత్వంతో ఎంతో మంచి పనులు చేస్తున్నటువంటి మహేష్ బాబు పట్ల ఇప్పటివరకు ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. అయితే తండ్రి లాగే తనయుడు గౌతమ్ సైతం సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నడం విశేషం.

మహేష్ బాబు ఫౌండేషన్ తో రెయిన్ బో హాస్పిటల్ కోలాబరేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెయిన్ బో హాస్పిటల్ సందర్శించిన గౌతమ్ అక్కడ గుండె సమస్యలతో బాధపడే చిన్నారులను పరామర్శించి వారితో కొంత సమయం పాటు గడపడమే కాకుండా వారికి కానుకలు ఇచ్చే వారి మోములో చిరునవ్వులు తీసుకువచ్చారు.

Gautham: సంతోషంలో మహేష్ బాబు ఫ్యాన్స్…


ఈ విధంగా గౌతమ్ హాస్పిటల్ కి వెళ్లి చిన్నారులను పరామర్శిస్తూ ఉన్నటువంటి ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చాలా గర్వంగా ఉంది అంటూ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.