Geetha Krishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు కోట శ్రీనివాసరావు ఒకరు. ఈయన ఎన్నో వందల సినిమాలలో విలక్షణ నటుడిగా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.అయితే ప్రస్తుతం కోటకు ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో ఈయన యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూ ఇస్తూ ఇండస్ట్రీలో హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ఆయన ఎంత ఎదిగిన సినీ కార్మికుడని సినీ కార్మికుల కోసం తాను హాస్పిటల్ నిర్మిస్తానని చెప్పిన వ్యాఖ్యలపై కోట తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హాస్పిటల్ కాదు ముందు కార్మికులకు ఫుడ్ పెట్టు అంటూ విమర్శలు చేయడమే కాకుండా, చిరంజీవి ఆపదలో ఉన్న ఎవరికి సహాయం చేయలేదని ఆయన పై కామెంట్ చేశారు.

అదేవిధంగా మెగాస్టార్ కొడుకుగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు కానీ ఆయనకు పెద్దగా నటన రాదంటూ రామ్ చరణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే కోట చేసిన ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ గీతాకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట ముసలోడు అయ్యాడు. తన పని అయిపోయింది అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. చిరంజీవిగారు ఇండస్ట్రీలో ఎంతోమందికి సహాయం చేశారు ఆ విషయం అందరికి తెలిసిందే.
క్యారెక్టర్ మంచిది కాదు…
ఇక మెగాస్టార్ చిరంజీవి గారు హాస్పిటల్ కట్టడం ఇష్టం లేకపోతే ఆయన ఏం చేస్తే బాగుంటుందో, సలహా ఇవ్వు అంతేకాని అతనిపై విమర్శలు చేయడం తగదు.ఇక ఈయన గురించి ఇలా విమర్శలు చేయడం మంచిది కాదని తెలుపుతూనే కోట శ్రీనివాసరావు వ్యక్తిత్వం బయటపెట్టారు. ఆయన క్యారెక్టర్ మంచిది కాదని, ఆడవాళ్ళ పట్ల కోట చాలా నీచంగా ప్రవర్తిస్తాడని, ఆయన ఒక దుర్మార్గుడిని గీతాకృష్ణ వెల్లడించారు.కోకిల సినిమా షూటింగ్ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ తో పెద్దగా గొడవ పెట్టుకున్నారు తనని తింటారు. ఆ సమయంలో నేను కూడా కోటకు బాగా క్లాస్ పీకాననీ తెలిపారు. ఇక మెగాస్టార్ ఎలాంటి సహాయం చేయలేదు, మోహన్ బాబు కొడుకు మా బిల్డింగ్ కట్టిస్తానని చెప్పారు కదా, మరి కట్టించారా, ఆ విషయం ఏమైందనీ గీత కృష్ణ ప్రశ్నించారు. కోట శ్రీనివాసరావు నటన పరంగా మంచి నటుడు అయినప్పటికీ క్యారెక్టర్ పరంగా నీచుడు, తన సొంత తమ్ముడిని ఇండస్ట్రీలో ఎదగకుండా చేసిన వ్యక్తి కోటా అంటూ అతని పై ఆగ్రహం వ్యక్తం చేశారు.































