Geetha Krishna : టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తన ఎనాలిసిస్ చెబుతూ ఉంటాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్.. జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన కిర్రాక్ ఆర్పి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ ఇష్యూ మీద జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ రామ్ ప్రసాద్, హైపర్ ఆది సోషల్ మీడియాలో స్పందించి జబర్దస్త్ లో ఉన్న పరిస్థితుల గురించి వివరించారు. ఇక మళ్ళీ ఆర్పి జబర్దస్త్ మీద, శ్యామ్ ప్రసాద్ మీద విమర్శించాడు.

వాడు గొట్టం గాడు…
ఇక ఈ అంశాలమీద డైరెక్టర్ గీతా కృష్ణ మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ నా స్నేహితుడు, కాలేజీలో ఇద్దరం కలిసి చదువుకున్నాం అంటూ చెప్పారు. ఈటీవీ రేటింగ్స్ పడిపోయిన సందర్బంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి రియాలిటీ షోస్ ని ఈటీవీలో పెట్టి రేటింగ్స్ పెంచారు. జబర్దస్త్ వల్ల నాగబాబు, రోజా, అనసూయ వంటివారికి లైఫ్ వచ్చిందంటూ చెప్పారు. జబర్దస్త్ వల్ల కిర్రాక్ ఆర్పి కి లైఫ్ వచ్చింది కానీ కిర్రాక్ ఆర్పి వల్ల జబర్దస్త్ కి లైఫ్ రాలేదు. వాడో గొట్టం గాడు, పబ్లిసిటీ కోసం ఇలా మాట్లాడుతున్నాడు. నాగబాబు, రోజా లాంటి ఐరన్ లెగ్గులకు జబర్దస్త్ ద్వారా మళ్ళీ ఫ్యూచర్ ఇచ్చాడు శ్యామ్ ప్రసాద్.

అంత పెద్ద సంస్థలో సాంబార్ బాగోలేదని వెళ్ళిపోయా అంటూ మాట్లాడుతున్నాడు సాంబార్ గాడు అంటూ కామెంట్ చేసాడు. మల్లెమాల చాలా పెద్ద సంస్థ అలాంటి సంస్థలో ఫుడ్డు బాగోలేదని ఎలా చెప్తాడు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిండి, వసతి బాగా ఇస్తారని ఇతర రాష్ట్రాల వాళ్ళు అంటారు. అలాంటిది ఈ గొట్టం గాడు ఫుడ్డు బాగోలేదని ఆరోపిస్తే మల్లెమాల నేమ్ పోతుందా, ఈ ఇష్యూ వల్ల శ్యామ్ కి వచ్చే నష్టమేమీ లేదు అంటూ ఫైర్ అయ్యాడు గీతా కృష్ణ.































