AP Politics: ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా సంచలనంగా మారాయి. అందరి ఆసక్తి ఏపీ రాజకీయాలపైనే ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోటీ చేస్తుండగా మరోవైపు ఈయనని ఓడించడం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే బిజెపి పార్టీలు మూడు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయనకు మద్దతుగా ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సీరియల్ ఆర్టిస్టులు మెగా హీరోలు అలాగే జబర్దస్త్ కమెడియన్లు కూడా పిఠాపురంలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్స్ అయినటువంటి హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ గెటప్ శీను సుడిగాలి సుధీర్ వంటి వారు భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇకపోతే గెటప్ శీను నటించిన రాజు యాదవ్ సినిమా కూడా త్వరలోనే విడుదల కాబోతోంది ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ లో ఈయనకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు ప్రస్తుతం జనసేన పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను చేస్తున్నారు కదా ఒకవేళ ఏపీలో మళ్ళీ వైసిపి పార్టీ అధికారంలోకి వస్తే కెరియర్ పరంగా మీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది.
పరిణితి చెందిన ఆలోచన కాదు..
ఈ ప్రశ్నకు గెటప్ శీను సమాధానంగా ఇటీవల యాంకర్ శ్యామల చేసినటువంటి సమాధానం చెప్పారు. ఈమెకు కూడా అదే ప్రశ్న ఎదురైంది. మీరు వైసిపికి సపోర్ట్ చేస్తున్నారు రేపు కూటమి అధికారంలోకి వస్తే మెగా ఫ్యామిలీ సినిమా ఈవెంట్లు మీకు అవకాశం రాకపోవచ్చు కదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు శ్యామల సమాధానం చెబుతూ.. ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీరిని తొక్కేద్దాం.. ఆపేద్దాం అనుకోవడం నిజంగా పరిణితి చెందిన ఆలోచన కాదనేది నా అభిప్రాయం అంటూ శ్యామల చెప్పిన సమాధానమే ఈయన కూడా చెప్పడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.





























