హైదరాబాద్ వరద బాదితులు సాయం కోసం మీ సేవ సెంటర్లకు పోటెత్తారు. ఈ క్రమంలో నగరంలోని మీ సేవ సెంటర్లు అన్ని రద్దీగా మారాయి. ఈరోజు నుంచి వరద బాధితులకు డబ్బు పంపిణీ చేస్తామని గతంలో సిఎం కెసిఆర్ ప్రకటించడంతో మీ సేవ సెంటర్ల వద్ద ఉదయం నుంచి బాధితులు క్యూ కట్టారు. ఆల్వాల్ మీసేవ సెంటర్ వద్ద బాదితులు ఆందోళనకు దిగి రాస్తారోకో కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు కిలోమీటరు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఈ నేపధ్యంలో వరదసాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లకు రావాల్సిన పనిలేదని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ పేర్కొన్నారు. జిహెచ్ఎంసి బృందాలు క్షేత్రస్టాయిలో పర్యటించి వరద సాయం అందని వారి వివరాలు సేకరిస్తున్నాయని, ఆధార నెంబర్, బ్యాంకు ఖాతాల వివరాలు దృవీకరించి అకౌంట్లలోకి నేరుగా రూ.10 వేలు జమ చేస్తామని తెలిపారు.































