జ్యూస్ లను చాలామంది ఎక్కువగా ఎండాకాలంలో తాగుతుంటారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి మాత్రమే వాళ్లు.. ఆ జ్యూస్ లను తాగుతారు. అయితే చాలామంది ప్రస్తుత జీవన విధానంలో .. బిజీ బిజీ లైఫ్ లో ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో కొంతమందికి ఊబకాయంతో బాధపడుతుంటారు. ఇలా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి తెగ ఇబ్బందులు పడుతుంటారు. ఇలా కాకుండా వంటింట్లోనే ఓ జ్యూస్ ను చేసుకొని త్రాగటం వల్ల కొవ్వును తగ్గించుకోవచ్చు.

వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.. వెల్లుల్లి, అల్లం, నిమ్మకాయ రసం, యాపిల్ సైడెర్ వెనిగర్, తేనె ద్వారా తయారు చేసుకునే జ్యూస్ కొవ్వును కరిగించడంలో ఎంతో ఉపయోగపడతాయి. అందులో వెల్లుల్లికి ధమనుల్లో బీపీని తగ్గించి.. చెడు కొలెస్టరాల్ ను తరమికొట్టే గుణం ఉంటుంది. దీంతో ఇది బరువు తగ్గడానికి ఎంతో గానో ఉపయోగపడుతుంది. శరీరమంతా రక్త ప్రసరణ జరడానికి నిమ్మకాయ రసం ఎంతగాగో తోడ్పడుతుంది.
ఇలా రక్తప్రసరణ ప్రతీ అవయవానికి అందితే.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఇక చెడు వ్యర్థాల్ని బయటకు పంపించడంలో.. యాపిల్ సైడెర్ వెనిగర్ లో ఉండే.. యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. తెనె కూడా గుండెకు సంబంధించిన వ్యాధులను తగ్గించి.. కొలెస్టరాల్ ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. వాటిని అన్నింటిని తగిన మోతాదులో తీసుకొని .. ప్రతీది ఒక కప్పు తీసుకొని అల్లం రసం, వెల్లుల్లి రసం, నిమ్మ రసం, వెనిగర్ అన్నింటినీ ఓ సాస్ ప్యాన్‌లో పోయాలి.
వాటిని 30 నిమిషాలు ఉడికించి.. అప్పుడప్పుడు వాటిని కలుపుతూ ఉండాలి. అరగంట తర్వాత స్టవ్ నుంచీ కిందకు దింపి… చల్లారనివ్వాలి. ఆ జ్యూస్‌లో 2 కప్పుల తేనె పోసి… బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ శుభ్రమైన గాజు సీసాలో పోసి… ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇలా రోజుకు మూడు పూటలు స్పూన్ తీసుకోవాలి. దీంతో కొలెస్టరాల్ తగ్గి బరువు తగ్గుతారు.



























