మనదేశంలో మాంసానికి డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికి తెలిసిందే. ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరూ మాంసం తినడం మొదలు పెట్టారు. దీనితో రోజు రోజుకి మాంసం ధరలు పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు ఎక్కడ కనిపించడం లేదు.ప్రస్తుతం కిలో మటన్ ధర 700 రూపాయలుగా ఉంది. ఒక పండుగ సమయాల్లో అయితే దాదాపు వెయ్యి రూపాయల వరకు పెరుగుతోంది.

దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా జంతువులను పెంచుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే మాంసాహారం లభించే కోళ్లు, మేకలు, గొర్రెలు లాంటి వాటిని పెంచుకుంటూ వాటి ద్వారా లక్షలలో సంపాదిస్తున్నారు. ఇది ఇలా ఉంటే సాధారణంగా మార్కెట్ కు వెళ్లి గొర్రె కొనాలి అనుకుంటే చిన్న గొర్రెలు అయితే పది వేలకు లోపుగా ఉంటాయి.
ఒకవేళ పెద్ద గొర్రెలు అయితే 10 నుంచి 20 వేల మధ్య ధర పలుకుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక గొర్రె మాత్రం ఏకంగా రెండు లక్షల ధర పలికింది రికార్డును సృష్టించింది. గొర్రె రెండు లక్షల ధర పలకడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. ఒక గొర్రె రెండు లక్షల రూపాయలు పలికింది. పోనీ ఆ గొర్రెలో ఏమైనా ప్రత్యేకత ఉందా అంటే అది కూడా లేదు.
కానీ ఆ గొర్రెకు ఎక్కువగా డిమాండ్ ఉండటంతో ఆ యజమాని దాని ధరను అమాంతం పెంచేశాడు. దీంతో ఎలాగైనా సరే ఆ గొర్రెను కొనాలన్నా ఉద్దేశంతో ఒక వ్యక్తి దానిని కొనుగోలు చేశాడు. అంతే కాకుండా దానిని ఊరేగింపుగా తనఇంటికి తీసుకెళ్లిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మల్లవల్లి తాలూకా దేవిపుర గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన సన్నప్ప అనే ఒక వ్యక్తి గొర్రెను పెంచాడు. రెండేళ్ల క్రితం ఆ గొర్రెను లక్ష రూపాయలకు కొనుగోలు చేయగా, రెండేళ్లలో దాని ధర పెరుగుతూ వచ్చింది.అలా ఆ గొర్రె ధర రెండు లక్షలు పలికి రికార్డును సృష్టించింది. ఈ గొర్రె గొర్రెల సంతానోత్పత్తికి ప్రధానంగా మారిందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































