బంగారం అంటే మహిళలతో పాటు పురుషులకు కూడా ఎంతో మక్కువ. ఈ బంగారం ఎంత విలువైందో అందరికి తెలిసిందే. అలంకరణతో పాటు పెట్టుబడి మార్గంగానూ ఆదరణ పొందిన పసిడి విలువ ఎప్పటికప్పుడూ పెరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న బంగారాన్ని నీటి నుంచి తయారు చేశారు కొందరు పరిశోధకులు. ఏకంగా నీటి బింధువును ప్రకాశవంతంగా మెరిసే బంగారు లోహపు బొట్టుగా మార్చారు. బంగారాన్ని కృత్రిమంగా తయారు చేయాలని పురాతన కాలం నుంచి ప్రత్నిస్తునే ఉన్నారు. పురాతన కాలం నుంచి లోహాలు, రసాయానాలను కలపడం ద్వారా బంగారం చేయడానికి అనేక ప్రయత్నాలు కూడా జరిగాయి. దీనినే రస-విధ అని పిలుస్తారు.

తాజాగా పరిశోధకులు దీనిని ఇలా తయారు చేశరు. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో భౌతిక రసాయన శాస్త్రవేత్తలు ఆల్కలీన్ లోహాల సహాయంతో ఈ ఘనతను సాధించారు. సాధారణ నీటిని తీసుకొని మెరిసే లోహంగా మార్చేశారు. ఈ అద్భుత దృశ్యం కొన్ని సెకన్ల పాటే కొనసాగినప్పటికీ శాస్త్రవేత్తలకు భారీ విజయాన్ని అందించింది. సిద్ధాంతం ప్రకారం చాలా పదార్థాలు అధిక పీడనం వద్ద లోహాలుగా మారతాయి. అధిక పీడనాల వల్ల అణువులు చాలా దృఢంగా వేరే ఒక పదార్థంగా ఏర్పడుతుంది. అప్పుడు ఆ పదార్థం రాగి, ఇనుము మాదిరి విద్యుత్ వాహకంగా మారుతుంది.
ఇలాంటి అధిక పీడనాన్ని ప్రయోగశాలలో సృష్టించలేం. యురెనస్ లేదా నెఫ్ట్యూన్ లాంటి భారీ గ్రహాలు లోహ స్థితిలో నీటిని పెంపొందిస్తాయని, అంతేకాకుండా అధిక వాతావరణ పీడనాన్ని కలిగి ఉంటాయని జియోఫిజిస్టులు ప్రతిపాదించారు. ఈ తయారీకి సోడియం, పొటాషియం లాంటి క్షార లోహాలను వినియోగించారు. ఎందుకంటే ఈ లోహాలు వాటి వెలుపలి ఎలక్ట్రాన్ ను దానం చేస్తాయి. అందువల్ల ఎలక్ట్రాన్ ను డోప్ చేస్తే క్షార లోహపు నీటి ద్రావణం కొన్ని సెకన్ల పాటు బంగారు లోహపు బొట్టుగా మారి అదే ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ ప్రయోగంలో ఓ అవరోధం ఏర్పడింది. క్షార లోహాలు నీటితో పేలుడుగా) ప్రతిస్పందిస్తాయి. దీన్ని ఎదుర్కొని ప్రతి చర్య పేలి పోకుండా ఉండాలంటే పరిశోధకులు ఈ ప్రయోగం నిదానంగా, జాగ్రత్తగా చేయాలి.
అలా చేయడానికి పరిశోధకులు సిరంజిని రెండు క్షార లోహాలతో నింపారు. ఎందుకంటే ఈ లోహాలు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉంటాయి. వాటిని వ్యాక్యూమ్ ఛాంబర్లో ఉంచారు. అనంతరం సిరంజీలో మిశ్రమాన్ని నీటి చుక్కగా ఏర్పరిచారు. నీటి బిందువుపై నీరు ఘనిభవించిన వెంటనే ఎలక్ట్రాన్, పాజిటివ్ మెటాలిక్ అయాన్లను నీటిలోకి వ్యాప్తి చేసి దాన్ని బంగారు పొరగా మార్చారు.






























