టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తిరుపతి చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి 152 వ సినిమాగా వస్తున్న ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 90 శాతం పూర్తి చేసుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

కానీ ఈ కరోనా మహమ్మారి కారణంగా విడుదల తేదీని వాయిదా వేస్తూ వచ్చింది చిత్రబృందం. ఈ నేపథ్యంలోనే ఆచార్య సినిమా రిలీజ్ డేట్ అప్పుడే అంటూ ఎన్నో రకాల డేట్లు, వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఆచార్య సినిమాను ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. చిరంజీవి ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడు. ఆచార్య సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగానే మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా కూడా అవుతోంది.
ఈ సినిమాలతో పాటు గా మొహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న బోళా శంకర్, అలాగే బాబీ లతో చిరు సినిమాలు చేయాల్సి ఉండగా వీటిలో ముందుగా బాబు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చిరు ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 6న లాంఛనంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మాస్ మసాలా కథతో తెరకెక్కుతున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు వాల్తేరు వాసు అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఇందులో రామ్ చరణ్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ చిరంజీవి మాజీ నక్సలైట్ గా కనిపించనున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ రెజీనా ఒక ప్రత్యేక సాంగ్ లో మెగాస్టార్ తో ఆడి పాడిందని సమాచారం.

































