డెంగ్యూ వ్యాధి బారిన పడ్డ వాళ్లకు శుభవార్త!

0
235

కొన్నిసార్లు చెడులోను మంచే జరుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధనను చూస్తే ఈ సామెత నిజమేనని నమ్మాలనిపిస్తోంది. ఎందుకంటే బ్రెజిల్ లోని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఎవరైతే డెంగ్యూ బారిన పడి కోలుకుంటారో వారికి కరోనా సోకే ముప్పు తక్కువని తేల్చారు. వినడానికి కొంత విచిత్రంగానే శాస్త్రవేత్తలు చెబుతున్న కారణాలు వింటే నిజమేనని నమ్మాల్సి వస్తోంది.

దోమ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులలో డెంగ్యూ ప్రమాదకరమైనది. డెంగ్యూ బారిన పడి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా మనం చూశాం. ఎవరైతే డెంగ్యూ బారిన పడతారో వాళ్ల శరీరంలో రక్త కణాలు వేగంగా తగ్గుతాయి. డెంగ్యూ బారిన పడ్డ వారు శారీరకంగా బలహీనపడటంతో పాటు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అయితే డెంగ్యూ నుంచి కోలుకున్న తరువాత వారిలో మరోసారి డెంగ్యూ బారిన పడకుండా యాంటీబాడీలు తయారవుతాయి.

అలా డెంగ్యూ ద్వారా కోలుకున్న వారిలో ఉండే యాంటీబాడీలే వారు కరోనా బారిన పడకుండా ఉండటానికి కారణమవుతున్నాయి. మిగుల్ నికోలెసిన్ అనే డ్యూక్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఈ విషయాలను వెల్లడించారు. త్వరలో శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనానికి సంబంధించిన నివేదిక ప్రచురితం కానుంది. నికోలేసిస్ మాట్లాడుతూ 2019లో డెంగ్యూ ప్రబలిన ప్రాంతాల్లో తక్కువగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని వెల్లడించారు.

శరీరంలోని యాంటీబాడీలు డెంగ్యూకు, కరోనా వైరస్ కు ఒకే విధంగా స్పందిస్తున్నాయని ఇమ్యూనిటీ విషయంలో రెండూ ఒకే విధంగా ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యామాని చెప్పారు. డెంగ్యూ రోగుల కోసం వాడే మందులను కరోనా రోగులపై ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉండవచ్చని.. బ్రెజిల్ లో గతేడాది డెంగ్యూ విజృంభించిన రాష్ట్రాల్లో ఆలస్యంగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here