మనలో చాలామందికి సొంతింటి కల నెరవేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. సొంత ఇల్లు లేనివాళ్లు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఎంత మంచి ఉద్యోగం ఉన్నా ఇల్లు లేకపొతే జీతంలో ఎక్కువ మొత్తం అద్దెకే చెల్లించాల్సి వస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా చాలామందికి సొంతింటి కలను నెరవేర్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత కాలంలో ఇల్లు కట్టాలంటే లక్షలకు లక్షలు ఖర్చు చేయాలి.

అయితే ఆ ప్రాంతంలో మాత్రం ఇల్లు కేవలం 86 రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజంగా 86 రూపాయలు ఉంటే అక్కడ ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ బంపర్ ఆఫర్ మన దేశంలో కాదులెండి. ఇట‌లీలోని స‌లేమీలో సిసిలో ప‌ట్ట‌ణంలో ఒక్క యూరోకే ఇంటిని కొనుగోలు చేయవచ్చు. అక్కడి పాలకులు జనాలను ఆకర్షించేందుకు మన కరెన్సీ ప్రకారం 86 రూపాయలకే ఇల్లు పొందే అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు.

అక్కడ ఇంత తక్కువ ధరకే ఇల్లు ఇవ్వడానికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయి. సిసిలీ ప్రాంతంలో 1968 సంవత్సరంలో భూకంపం వచ్చింది. భూకంపం వల్ల ఆ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో సిసిలీ నగరంలో, సలేమీ పట్టణంలో ప్రజలు అక్కడి నుంచి నగరాలకు వలస వెళ్లిపోవడంతో అక్కడ జనాభా క్రమంగా తగ్గుతోంది. దీంతో అక్కడి పాలకులు భవిష్యత్తులో అక్కడ ప్రజలు నివశించరేమో అని టెన్షన్ పడుతున్నారు.

దీంతో ఒక్క యూరోకే ఇల్లు అనే స్కీమ్ ను ప్రవేశపెట్టి అక్కడ జనాభా పెరిగే విధంగా చేయాలని.. గతంలోలా ఈ ప్రాంతం కళకళలాడాలని పాలకులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో నివాసయోగ్యమైన స్థలాలను గుర్తించి వేలానికి అందుబాటులో ఉంచారు. ఇళ్లను కొనుగోలు చేసేవాళ్లు ఆ ఇళ్లను స్వంత ఖర్చులతో రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here