ఫ్లాష్ న్యూస్ : ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాదారులకు శుభవార్త…!!

0
485

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఉన్న మహిళలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచంలో విలతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే తేరుకుని దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెల్సిందే… ఈ సమయంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది సామాన్య ప్రజలు మాత్రమే. అయితే ఈ క్రమంలో మహిళలకు ఆర్ధిక సహాయం అందించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. “పీఎం గరీబ్ కళ్యాణ్” ప్యాకేజి కింద ప్రధాన మంత్రి జన్ ధన్ అకౌంట్స్ ఉన్న మహిళలు అందరికి రూ. 500 చొప్పున జమచేయనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి ఈ ఆర్ధిక సహాయం చేయనుంది.

ఈనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ జన్ ధన్ అకౌంట్లలో డబ్బులు వేయనున్నారు. అకౌంట్స్ లో నగదు క్రెడిట్ అయిన తరువాత రూపే డెబిట్ కార్డు ను ఉపయోగించి ఆ డబ్బును ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు మరో కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కొందరు మహిళల కెవైసి పత్రాలు లేవన్న నెపంతో చిన్న చిన్న అకౌంట్లను స్తంభిపచేయొద్దని సూచించింది. ఇప్పటికే డీయాక్టివేట్ చేసిన అకౌంట్లను వెంటనే యాక్టివేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన మంత్రి జన్ ధన్ అకౌంట్స్ ఉన్న మహిళలు తమ ఖాతాలను ఒకసారి చెక్ చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here