Grey Movie: సీరియల్స్ ద్వారా మంచి పేరు సంపాదించుకొని.. తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 హౌస్ లో ఎంట్రీ ఇచ్చాడు అలీ రెజా. ప్రస్తుతం అతడు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్ సినిమాగా వస్తున్న ‘‘గ్రే’’ లో ఇతడు హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో అతడితో పాటు.. ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, ఊర్వశీ రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఊర్వశీ రాయ్ మొదటిసారిగా వెండితెరపై కనువిందు చేయనుంది. ఈ చిత్రానికి రాజ్ ముదిరాజ్ దర్శకుడిగా పనిచేస్తుండగా.. ఈ సినిమా అద్వితీయ మూవీస్ ప్రై లి పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతుంది.
కిరణ్ కాళ్లకూరి నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ది స్పై హూ లవ్డ్ అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు రాజ్ ముదిరాజ్ మాట్లాడారు. మన దేశంలో గత ఐదారేళ్లల్లో దాదాపు 12 మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారన్నారు.
మంచి ఇమేజ్ ను తెచ్చిపెడుతుందని ..
దీనికి కారణం ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజేన్సీ. వీళ్లు జాగ్రత్తగా వలపన్ని చేసిన ఆపరేషన్స్ అని.. దాని నుంచి పుట్టిన ఐడియానే గ్రే మూవీ అని దర్శకుడు అన్నాడు. ఇక ప్రతీ ఆలోచన వెనుకు కొన్ని వింతైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయని.. వాటిని ఆధారం చేసుకొని తీసిన సినిమానే ఈ గ్రే స్పై డ్రామా అన్నాడు. ఇక ఈ సినిమాలో అలీ రెజా నటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు దర్శకుడు. ఇక హీరోయిన్ గా ఊర్వశీ రాయ్ పరిచయం అవుతుందని అన్నాడు. అంతే కాకుండా.. ఈ సినిమాలో నటుడు అరవింద్ కృష్ణ చేయడం తనకు ఇంకా మంచి ఇమేజ్ ను తెచ్చిపెడుతుందని తెలియజేశారు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా నాగరాజు తాల్లూరి పని చేశాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని.. మొదటి కాపీ తాము చూశామని.. ఎంతో బాగుందన్నారు.






























