9000 రూపాయలు తగ్గిన పసిడి.. ఇప్పుడు కొంటే మంచిదేనా..?

0
215

మనలో చాలామంది బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే పెరుగుతున్న ధరలను చూసి భయపడి చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపరు. అయితే బులియన్ మార్కెట్ నిపుణులు మాత్రం బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెబుతున్నారు. గడిచిన మూడు నెలల్లో బంగారం ధర ఏకంగా 9,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు తగ్గిందని ఇప్పుడు కొనుగోలు చేయకపోతే మళ్లీ ధర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

2020 సంవత్సరం తొలినాళ్ల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధర గత కొన్ని రోజుల నుంచి తగ్గుతోందని ఇప్పుడు బంగారం కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆగష్టు నెలలో బంగారం ధర ఏకంగా 59,130 రూపాయలకు వెండి ధర 76,510 రూపాయలకు చేరింది. అయితే ప్రస్తుతం బంగారం ధర క్రమంగా తగ్గుతుండటంతో ఇదే సరైన సమయంలో కొత్త ఏడాదిలో బంగారం ధర పరుగులు పెట్టే అవకాశం ఉందని సమాచారం.

గడిచిన మూడు నెలల్లో ఏకంగా బంగారం ధర 9,000 రూపాయలు పతనమైంది. వెండి ధర సైతం దాదాపు అదే స్థాయిలో తగ్గింది, కరోనా వ్యాక్సిన్ గురించి వెలువడుతున్న శుభవార్తలు బంగారం ధర తగ్గడానికి కారణం. అయితే భవిష్యత్తులో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నా ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పే అవకాశాలు లేవు కాబట్టి బంగారం ఇప్పుడు కొనుగోలు చేస్తేనే మంచిది.

పసిడి ధరలు భవిష్యత్తులో మాత్రం మరింతగా పెరుగుతాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం ధర నిన్న మాత్రం స్వల్పంగా పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here