బిగ్ బాస్ వేదికపై గ్రీన్ ఇండియా ఛాలెంజర్.. ఎంపీ సంతోష్ కుమార్ ఈ రోజు సందడి చేయనున్నారు. శనివారమే ఇతడు షోలో పాల్గొనగా.. ఆదివారం ఎపిసోడ్ లో అతడు కనిపించనున్నాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటే.. పర్యావరణంపై అవగాహన కల్పించడం. అందరిచేత మొక్కలు నాటిస్తున్నారు తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.

ఈ ఛాలెంజ్ లో అతడు సామాన్యులతో పాటు.. సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఇలా మొక్కలు నాటే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇక తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షోలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు అతడు ఈ షోలో పాల్గొని సందడి చేయనున్నారు. నిజానికి శనివారంమే దీనికి సంబంధించి షూటింగ్ పూర్తవగా.. ఆదివారం దీనిని ప్రసారం చేయనున్నారు. ఇక ఈ షో చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో సీజన్ ముగియనుంది.
ఈ క్రమంలో ప్రస్తుతం హౌస్‌లో 6 మంది పోటీదారులు ఉన్నారు. వారిలో ఒకరు నేడు ఎలిమినేట్ కానున్నారు. దాంతో ఇంట్లో 5 మంది సభ్యులు ఉంటారు. ఇప్పటికే దీనిలో శ్రీరామచంద్ర, సన్నీ టాప్ 5 లో ఉన్నారు. మిగతా మానస్, సిరి, షణ్ముక్ ఈ రోజు ఎపిసోడ్ లో టాప్ 5 లో టికెట్ దక్కించుకోనున్నారు. ఇక ఒక్క వారం మాత్రమే ఉండగా.. ఎవరు టైటిల్ గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ షోలో సంతోష్ కుమార్ సందడి ఎలా ఉంటుందో చూడాలి.



































