ఆగస్టు 9న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అత్యవసర భేటీ కానుంది కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లోని అంశాలపై . 3వ తేదీన జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ ఉమ్మడిగా సమావేశం అయి చర్చించిన విషయం తెలిసిందే. కేంద్ర గెజిట్‌పై రెండు తెలుగు రాష్ర్టాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాగే గోదావరి నదీ యాజమాన్య బోర్డు ( జీఆర్‌ఎంబీ ) 10వ నిర్వహించనుంది. అయితే ఈ సమావేశానికి హాజరుకాలేమని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఎన్జీటీ, సుప్రీంకోర్టులో కేసుల విచారణ ఉన్నందున బోర్డు సమావేశానికి హాజరు కావడానికి వీలుపడదని స్పష్టం చేసింది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాల పరిష్కారం కోసం.. గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు విస్తృత అధికారులు కల్పిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. అయితే ఈ గెజిట్‌పై తెలంగాణ,ఏపీలు అభ్యంత్రాలు వ్యక్తం చేస్తున్నాయి.































