మన ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. పెళ్లికి వచ్చిన చుట్టాలు, వారు చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఇక పెళ్లి రోజు వరుడు, వధువు స్నేహితులు కలిసి పెళ్లి లో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పెళ్లి ఊరేగింపుల్లో డీజే సాంగ్ లతో ప్రతి ఒక్కరూ డాన్సులు చేస్తూ ఎంతో ఆనందంలో మునిగి తేలుతుంటారు. ఈ విధంగా పెళ్లి ఊరేగింపులో భాగంగా వరుడు రెండు స్టెప్పులు వేశాడు.ఇక అంతే వరుడు వేసిన ఈ స్టెప్పులు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తన కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి దుస్తులలో మండపానికి ఊరేగింపుగా వెళ్తున్న వరుడిని తన స్నేహితులు రెండు స్టెప్పులు వేయాల్సిందిగా కోరారు. దీంతో మాంచి ఊపిచ్చే భోజ్‌పూరీ పాటను ప్లే చేయడంతో వరుడిలో డ్యాన్సర్ బయటకు వచ్చాడు. పూర్తిగా లీనమై వరుడు డాన్స్ వేయడంతో స్నేహితులు వన్స్ మోర్ అంటూ కేకలు వేయడంతో వరుడు అదే స్టెప్పును మరోసారి రిపీట్ చేశాడు.
ఈ విధంగా వరుడు చేసిన డాన్స్ కిసంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు నీ ముందు హీరోయిన్ కూడా పనికి రారని కామెంట్ చేయగా… మరికొందరు ఏమి ఊపు ఊపావ్ బ్రదర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఈ వరుడు చేసిన డాన్స్ చూస్తే మాత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వరుడు చేసిన ఆ డాన్స్ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.































