సాధారణంగా మన ఇంట్లో పెంచుకొనే పెంపుడు కుక్కలకు మనం ఏమి నేర్పించిన ఎంతో అవలీలగా నేర్చుకుంటాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు యజమానులకు కుక్కలు ఎంతో చేదోడువాదోడగా వంతు సహాయం చేయడం మనం చూస్తున్నాము. ఈ విధంగా కుక్కలు చేసే అల్లరి పనులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. అయితే అన్ని కుక్కల కంటే ఈ కుక్క ఎంతో భిన్నమైనదని చెప్పవచ్చు. దీని నైపుణ్యానికి ఏకంగా గిన్నిస్ వరల్డ్ బుక్ లో రికార్డును సొంతం చేసుకుంది. ఇంతకీ ఇది ఏం చేసిందో తెలుసుకుందాం..

అమెరికాలోని కాలిఫోర్నియాలో ట్వింకి జాక్ రస్సెల్ ఓ టెర్రియర్ జాతి కుక్క అద్భుతమైన రికార్డును సృష్టించింది. ఈ క్రమంలోనే బెలూన్లను పగలగొట్టే పోటీలు నిర్వహించగా ట్వింకి ఇందులో పాల్గొని ఎంతో వేగంగా బెలూన్లను పగులగొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.
ఈ పోటీలలో భాగంగా 100 బెలూన్లను ట్వింకి కేవలం 39.8 సెకండ్లలో పగలగొట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే ట్వింకి బెలూన్లను పగల కొడుతున్న తీరు అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2016 వ సంవత్సరంలో ఇదే రికార్డును ట్వింకి తల్లి అనస్తాసియా గిన్నిస్ బుక్ లో రికార్డుకెక్కింది.
అనస్తాసియా తరువాత ట్వింకి తన తల్లి రికార్డును బ్రేక్ చేసి అతి తక్కువ సమయంలోనే 100 బెలూన్లను పగలగొట్టింది. ఈ విధంగా మనుషులకే కాకుండా జంతువులు కూడా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులను సృష్టించి వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




























