మనలో చాలామంది పెంపుడు జంతువులను ఇష్టపడుతూ ఉంటారు. కొందరు కుక్కలను పెంచుకుంటే మరి కొందరు పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. కుక్కలు, పిల్లులను చూస్తే మనకు ఆహ్లాదంగా అనిపిస్తుంది. అయితే ఒక పిల్లి మాత్రం మనుషులను భయపెడుతోంది. సాధారణంగా హర్రర్ సినిమాల్లోని పిల్లులను చూస్తే మనం భయాందోళనకు గురవుతూ ఉంటాం. హర్రర్ సినిమాల్లో విచిత్రంగా ఉండే పిల్లుల కళ్లు మనుషులను భయపెడతాయి.

అయితే ఈ పిల్లి మాత్రం సాధారణ పిల్లులకు, హర్రర్ పిల్లలకు కూడా భిన్నం. కనుగుడ్లు లేని ఈ పిల్లిని చూస్తే గజగజా వణకాల్సిందే. కనుగుడ్లు లేని ఈ పిల్లిని అకస్మాత్తుగా చూస్తే పిల్లి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. బొచ్చు విషయంలో కూడా సాధారణ పిల్లితో పోలిస్తే ఈ పిల్లి భిన్నంగా ఉంటుంది. అన్ని పిల్లుల్లా ఈ పిల్లికి బొచ్చు కూడా లేకపోవడం గమనార్హం. ఈ పిల్లిని చూస్తే దెయ్యమే కళ్ల ముందుకు వచ్చిందేమో అనిపిస్తుంది.
 
చూడటానికి రబ్బరుబొమ్మలా కనిపించే పిల్లి మనుషులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిల్లి గురించే భారీస్థాయిలో చర్చ జరుగుతోంది. 12 సంవత్సరాల వయస్సు గల ఈ పిల్లి పేరు జాస్పెర్. పుట్టినప్పుడు ఈ పిల్లికి ఎలాంటి సమస్య లేదు. అయితే పిల్లి పదో ఏట ఫెలైన్ హెర్పెస్ వైరస్ బారిన పడిన పిల్లికి క్రమంగా బొచ్చు ఊడిపోవడం ప్రారంభమైంది.
 
అనంతరం కుడి కన్నుపై కూడా ప్రభావం పడటంతో ఆ పిల్లి బ్రతకటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు కనుగుడ్డును తొలగించారు. అయితే ఆ తర్వాత ఎడమ కంటికి కూడా సమస్య ఏర్పడటంతో వైద్యులు ఎడమ కంటిని కూడా తొలగించారు. దీంతో రెండేళ్ల క్రితం వరకు అందంగా కనిపించిన పిల్లి ఇప్పుడు అంద విహీనంగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here