Happy Days Appu:శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇంజనీరింగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం హ్యాపీ డేస్. వరుణ్ సందేశ్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమైతే చూడని ప్రేక్షకులు ఉండరు.

ఈ విధంగా హ్యాపీ డేస్ చిత్రం ద్వారా నిఖిల్ ను లవ్ చేస్తూ తనని ఆట పట్టించే అమ్మాయి అప్పు పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పు పాత్రలో నటించిన అమ్మాయి పేరు గాయత్రీ రావు. ఈ సినిమాలో అప్పు పాత్రలో నటించిన గాయత్రీరావు ఎంతో మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమా అనంతరం ఆరెంజ్,గబ్బర్ సింగ్ వంటి సినిమాలలో కూడా నటించిన ఈమెకు అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా సినీ అవకాశాలు రాకపోవడంతో గాయత్రీరావు 2019లో వివాహం చేసుకొని పూర్తిగా తన వైవాహిక జీవితానికి అంకితమయ్యారు. వివాహం తర్వాత గాయత్రీరావు ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు చూస్తే అసలు ఇక్కడ హ్యాపీ డేస్ అప్పునేనా అంటూ సందేహం వ్యక్తం చేస్తారు.
ఇండస్ట్రీలోనే అప్పు తల్లిదండ్రులు…
ఇలా పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిన గాయత్రీ రావు అలియాస్ అప్పు తనకు సినిమా అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె వెల్లడించారు. ఇకపోతే గాయత్రీరావు తల్లిదండ్రులు పద్మ అరుణ్ కుమార్ లు కూడా ఇండస్ట్రీలోనే కొనసాగడం విశేషం. ఇక గాయత్రి తల్లి పద్మజ హ్యాపీడేస్ చిత్రంలో నిఖిల్ తల్లి పాత్రలో నటించారు. అలాగే పలు సినిమాల్లో కూడా ఈమె సందడి చేశారు. గాయత్రి రావు తండ్రి అరుణ్ కుమార్ కూడా ఎన్నో సినిమాలలో తండ్రి పాత్రలో నటించారు.



























