Hari krishna: నందమూరి తారకరత్న మరణంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలా నందమూరి నారా కుటుంబంలో తారకరత్న మరణ వార్త ఎంతగానో కృంగదీసిందని చెప్పాలి. తారకరత్న మరణించడంతో పెద్ద ఎత్తున అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇలా నందమూరి కుటుంబంలో ప్రతి ఏడాది ఇలాంటి విషాదాలు చోటు చేసుకోవడంతో అసలు నందమూరి కుటుంబానికి ఈ శాపం ఏంటి అని అభిమానులు నందమూరి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హరికృష్ణ జానకిరామ్ తారకరత్న వంటి వారందరూ కూడా వరుసగా మరణించడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇక తారకరత్న ఎంతో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఈయన పాదయాత్రలో భాగంగా ఒక్కసారి గుండెపోటు రావడంతో స్పృహ తప్పి పడిపోయారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చివరికి మృత్యు కౌగిలిలో బందీ అయ్యారు. ఇలా తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్, హరికృష్ణ, జానకిరామ్, తారకరత్న నందమూరి వంశస్థులు ఉన్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Hari krishna: నాలుగు రోజులు బ్రతికిన 40 తరాలు చెప్పుకునేలా బ్రతకాలి.
ఈ ఫోటోకి గాను బ్యాక్ గ్రౌండ్లో హరికృష్ణ చెప్పిన డైలాగ్స్ రూపొందించడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో నందమూరి అభిమానులను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఈ వీడియోలో భాగంగా హరికృష్ణ మాట్లాడుతూ… మనం బ్రతికేది నాలుగు రోజులు అయినా 40 తరాలు చెప్పుకునేలా బ్రతకాలి. ఎవరైనా ఎదుటివారు మనల్ని చేయి చాచి యాచిస్తే ఎప్పుడు కూడా మన చేయి పైనే ఉండాలే తప్ప కింద ఉండకూడదు.పైన బ్రహ్మదేవుడు ఆదేశించాడు. ఇక సెలవు అంటూ హరికృష్ణ చెప్పినటువంటి ఈ డైలాగ్ తో ఉన్నటువంటి ఈ వీడియో వైరల్ అవుతుంది.
దయచేసి అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి మన చావు ఎప్పటికీ అయినా రావాల్సిందే కానీ …….
మనల్ని నమ్ముకున్న వాళ్లకు ప్రేమించే ❤️ వాళ్లకు అది అనుక్షణం నరకం మిగులుస్తుంది … ???????? #TarakaRatna #RIPTarakaRatna #RIPTarakaratnaGaru #TarakaRatnaGaru #TarakaRatnarip #Tarakarathna pic.twitter.com/ZppwoEjBUJ
— Kadiri NTR Fans® Official™ (@kadiriNTR_Fans) February 20, 2023































