సాధారణంగా మనం రెక్కల గుర్రం గురించి చందమామ కథలలో వినే ఉంటాం … అదే విధంగా ఈ విధమైనటువంటి రెక్కల గుర్రం సినిమాలలో కూడా చూసే ఉంటాము. అయితే ఇవన్నీ కేవలం కల్పితాలు మాత్రమే. కానీ నిజంగానే రెక్కల గుర్రం ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన చాలా మందికి కలిగి ఉంటుంది. అయితే ఈ విధంగా రెక్కల గుర్రాలను తలపించేలా కొన్నిసార్లు సాధారణ గుర్రాలను చూసినప్పుడు వాటిని పోలి ఉండే భావన కలుగుతుంది.

ఈ విధంగా రెక్కల గుర్రాలను తలపించే అంత అద్భుతంగా ఉన్న గుర్రమే ఈ తెల్ల గుర్రం. ఎంతో అందంగా ఉన్న ఈ గుర్రం చూస్తే మనసు పులకించి పోతుంది. ఈ గుర్రం గెంతులు వేస్తుంటే చూడటానికి కన్న సొంపుగా ఉంటుంది. ఈ గుర్రం గెంతులు వేస్తూ ఉంటే దాని తెల్లని జుట్టు కూడా ఎంతో అందంగా ఎగురుతోంది.ఇంత అందమైన తెల్లని గుర్రం చూడటానికే ఇంత అందంగా ఉంటే ఇక అది పరుగులు పెడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఎంతో పొడవాటి తెల్లని జుట్టు కలిగి ఉండి, అందంగా ఉన్నటువంటి ఈ గుర్రాన్ని చూస్తే జంతు ప్రేమికులు మాత్రమే కాకుండా, ఎవరైనా మనసు పారేసుకోవాల్సిందే. ఇదివరకు ఇలాంటి అద్భుతమైన గుర్రాలను కేవలం మనం సినిమాలలో మాత్రమే చూసి ఉంటాము. మరి ఇంకెందుకు ఆలస్యం అంత అందంగా ఉన్నటువంటి ఈ తెల్ల గుర్రంపై మీరు ఓ లుక్కేయండి. ప్రస్తుతం ఈ గుర్రం ఎంతో అందంగా గెంతుతూ ఉన్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.































