Manjula Daughter: మంజుల ఘట్టమనేని సూపర్ స్టార్ వారసురాలిగా మహేష్ బాబు సోదరిగా అందరికీ ఎంతో సుపరిచితమే కృష్ణా వారసురాలుగా ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కానీ కృష్ణ అభిమానుల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత రావడంతో కృష్ణ ఈమెను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆలోచన విరమించుకున్నారు. కానీ ఈమె పలు సినిమాలకు నిర్మాతగాను అలాగే పలు సినిమాలలో సహాయ నటి పాత్రలలో నటించి మెప్పించారు.

ఇలా సహాయ నటిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె దర్శక నిర్మాత అయిన సంజయ్ స్వరూప్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు జాహ్నవి స్వరూప్ అని ఒక కుమార్తె ఉన్నారు. ఇక ఈ చిన్నారి కూడా బాలనటిగా మంజుల దర్శకత్వంలో వచ్చిన మనసుకు నచ్చింది అనే సినిమాలో నటించారు అనంతరం చదువులపై శ్రద్ధ పెట్టారు.

బాలనటిగా జాహ్నవి..
ఇక మంజుల ప్రస్తుతం నిర్మాతగా వ్యాపారవేత్తగా కొనసాగుతూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు అలాగే అప్పుడప్పుడు తన కుమార్తె జాహ్నవికి సంబంధించిన ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే తన కుమార్తె హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదని ఈమె కనుక హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వస్తే స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అవుతుందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.



























