RRR Movie: దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట అవెయిటెడ్ మూవీ ట్రిపుల్ ఆర్ మళ్లీ వాయిదా పడింది. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ వాయిదా పడటం చాలా మంది అభిమానులను మరోసారి నిరాశ పరిచింది.

జనవరి 7న ఇండియా వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ విడుదల కావాల్సింది. మొత్తం 14 భాషల్లో ట్రిపుల్ ఆర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. అయితే కరోనా మరోసారి ట్రిపుల్ ఆర్ విడుదలకు బ్రేక్ వేసింది. ఇప్పటికే సినిమా యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్లను చేసింది.

దక్షిణాదిన హైదరాబాద్, త్రివేండ్రం, చెన్నై, బెంగళూర్ సిటీల్లో పలు కార్యక్రమాాలను నిర్వహించింది. ముంబై, చెన్నై నగరాల్లో ఫ్రీరీలీజ్ ఈవెంట్లను భారీ ఎత్తున నిర్వహించారు. ఇక జనవరి 7ని రిలీజ్ అవుతుంది అనుకుంటున్న తరుణంలో మరోసారి బాంబ్ పేల్చింది చిత్ర యూనిట్. అధికారికంగా వాయిదా నిర్ణయాన్ని ప్రకటించింది.
రిలీజ్ నాటికి ముసలి వాళ్లు కావాల్సిందే..
కరోనా కారణంగా పలు రాష్ట్రాలు ఆంక్షల్లోకి వెళుతున్నాయి. మరో వైపు ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రిపుల్ ఆర్ కలెక్షన్లపై ప్రభావం పడుతుందని మూవీ యూనిట్ భావించి రిలీజ్ ను వాయిదా వేసింది. ఇదిలా ఉంటే .. ట్రిపుల్ ఆర్ వాయిదాపై నెట్టింట్లో మీమ్స్, ట్రోలింగ్ మొదలైంది. కొంత మంది బాధతో పోస్టులు పెడుతుంటే.. మరికొంత మంది ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ మొదలైనప్పుడు యంగ్ ఏజ్ లో ఉంటే రిలీజ్ నాటికి ముసలివాడిగా మారినట్లు ఫన్నీగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఎన్టీఆర్, రాజమౌళి మూవీస్ లోని కోన్ని సీన్లను సందర్భానికి సరిపోయే విధంగా పోస్టులు పెడుతున్నారు.
It's official now.. ????#RRRPostponed pic.twitter.com/TvYJdEVnjY
— Whynot Cinemas (@WhynotCinemas) January 1, 2022
#RRRonJan7th #RRR #RRRpostponed
— Dr Humour (@humourdoctor) January 1, 2022
When RRR started When RRR releases pic.twitter.com/Q1X43VS4yi
@tarak9999 Fans ????#RRRPostponed#RRRMovie pic.twitter.com/HvMDhmqmi9
— ????బాలాజీ నాయుడు ???????????? (@Balunaidu71) January 1, 2022
The waiting streaks continues ????????
— Reddy Tarock (@reddy_tarock) January 1, 2022
For this man @tarak9999 Anna #RRRpostponed #ManOfMassesNTR pic.twitter.com/h7yYdOEHs5
#RRRPostponed changing dates be like pic.twitter.com/vINon9Mt6E
— RRR.Dhanu2123™???? (@dhanu9992) January 1, 2022
DVV signing Checks for promotion again#RRRpostponed #RRR pic.twitter.com/6NO2U78bsy
— OliviaMorris_Stan (@Watchmen_dr_man) January 1, 2022
































