AP: 2019 ఎన్నికలలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి వాలంటీర్ వ్యవస్థను తీసుకోవచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన ప్రజల ముంగిటికే అనే విధంగా ప్రజలకు అవసరమైనటువంటి పెన్షన్ రేషన్ ఇతర సర్టిఫికెట్లను కూడా వాలంటీర్ల ద్వారానే ఇంటి వరకు చేర్చారు.

ఇలా వాలంటీర్ వ్యవస్థను మొదట్లో తిరస్కరించినటువంటి ప్రతిపక్షాలు ఎన్నికల సమయానికి వాలంటీర్ వ్యవస్థ పై ప్రశంసలు కురిపించడమే కాకుండా తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం 10 వేలకు పెంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పటివరకు ఎలాంటి విషయాలను కూడా అధికారికంగా తెలియజేయలేదు. త్వరలోనే వాలంటీర్ వ్యవస్థ గురించి అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. ఇక త్వరలోనే వాలంటీర్లను నియమిస్తామని వెల్లడించడంతో గతంలో వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి పలువురు వాలంటీర్లు ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున లేఖలు రాస్తున్నారు.
డిగ్రీ అర్హత..
గతంలో వైసీపీ నాయకులు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్లు ఎదురు తిరిగారు. ఇక త్వరలోనే నియమించబోయే వాలంటీర్లుగా తమను విధులలోకి తీసుకోవాలని కోరుతూ వాలంటీర్లు లేఖలు రాయటం గమనార్హం. అయితే చంద్రబాబు నాయుడు 10,000 రూపాయల వేతనం చెల్లించడమే కాకుండా వాలంటీర్ గా చేయాలి అంటే డిగ్రీ అర్హత కూడా ఉండాలంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.





























