నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు..చెప్పండి. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలా నాన్ వెజ్ రోజు ఇష్టపడి తినే వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అమెరికా వైద్యులు తెలియజేస్తున్నారు.మాంసం ఎక్కువగా తినే వారిలో వివిధ రకాల అలర్జీ సమస్యలు తలెత్తుతున్నాయని ఈ సందర్భంగా నిపుణులు వెల్లడించారు.

అమెరికాలో ఈ విధంగా మాంసం తిని అలర్జీ బారిన పడినవారు ఎక్కువగా వైద్యులను సంప్రదిస్తున్నారు అని అయితే మాంసం తినడం వల్ల అలర్జీలు రావడానికి గల కారణం ఏమిటి అనే విషయం మాత్రం తెలియడం లేదని వైద్యులు వెల్లడించారు.తమ వద్దకు అలర్జీ సమస్యతో బాధపడుతున్న వారు అంతకుముందు రోజు మాంసం తిన్నట్లు చెప్పడం డాక్టర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అయితే ఈ విషయంలో నిజం లేదని కొట్టిపారేసిన డాక్టర్లు అల్ఫాగల్ అనే అలర్జీ రోగిపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో భాగంగా అతని శరీరంలో ఒక చిన్న కణంలో యాంటీబాడీ కనుగొనడం జరిగింది. అల్ఫాగల్‌కు ప్రతిరోధకాలలో అలర్జీ లక్షణాలు కనిపించడంతో వైద్యులు మాంసం తినడం వల్లే ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడించారు.
ఏదిఏమైనప్పటికీ మాంసం తినడం వల్ల అలర్జీ సమస్యలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే వైద్యులు మాంసం తినేవారు పలు జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉందంటూ ఈ సందర్భంగా వెల్లడించారు. మాంసం తినే వారు దానిని బాగా ఉడికించే తినడం వల్ల ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చని వైద్యులు తెలియజేశారు.
































