సాధారణంగా మనం ప్రతి రోజూ ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగనిదే మన రోజువారీ పనులను ప్రారంభించము.ఒక కప్పు కాఫీ తాగడం వల్ల మన శరీరంలోని నాడీ వ్యవస్థ ఎంతో చురుగ్గా పని చేయడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలోనే రోజంతా ఎంతో హుషారుగా పనులు చేసుకోగలుగుతాం. ఈ విధంగా ఒక కప్పు కాఫీ తాగటం వల్ల మనం చురుగ్గా ఉండటానికి గల కారణం కాఫీలో అధికభాగం కెఫిన్ అనే పదార్థం ఉండటం వల్ల మనల్ని ఎంతో హుషారుగా చేస్తుంది.

ఈ క్రమంలోనే కొందరు కాఫీలు ఆహార పదార్థాలను తక్కువగా తీసుకుంటూ ఎక్కువగా కాఫీ తాగుతూ ఉంటారు.కాఫీ తాగడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజు అధిక మొత్తంలో కాఫీ తీసుకోవడం వల్ల మన శరీరంలో అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. కనుక ప్రతిరోజూ కేవలం ఒక మనిషి 400 మిల్లీ గ్రాముల కాఫీ మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రతి రోజు ఒక మనిషి 400 మిల్లీ గ్రాములు అంటే సుమారు నాలుగు కప్పుల కాఫీ మాత్రమే సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కాఫీ అంటే ఇష్టం ఉండేవారు డీకెఫినేటెడ్ కాఫీ కంటే కెఫినేటెడ్ కాఫీ తాగడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. కెఫినేటెడ్ కాఫీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది. రుచితో పోలిస్తే డీకెఫినేటెడ్ కాఫీ, కెఫినేటెడ్ కాఫీ సమానంగా ఉన్నప్పటికీ డీకెఫినేటెడ్ కాఫీ అధిక కెఫిన్ కలిగి ఉంటుందని నిపుణులు తెలియజేశారు.
ఇక గర్భం దాల్చిన మహిళలు పాలిచ్చే తల్లులు ప్రతిరోజు కేవలం 200 మిల్లీ గ్రాముల మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విధంగా ఇన్స్టెంట్ కాఫీని రోజుకు అధికమొత్తంలో తీసుకోవటంవల్ల అధిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన తలనొప్పి, గుండె పనితీరు మందగించడం, జీర్ణక్రియ సమస్యలు, కండరాల నొప్పి వంటి వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి కనుక వీలైనంతవరకు రోజుకు నాలుగు కప్పుల కాఫీ మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.































