సాధారణంగా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నో ప్రకటనలను మనం చూస్తూనే ఉన్నాం. మద్యం సేవించడం వల్ల లివర్ క్యాన్సర్ వస్తుందని, మరి కొందరిలో లివర్ దెబ్బతినటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనీ అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ..ఎన్నో వాణిజ్య ప్రకటనలు వస్తున్న వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా ఆల్కహాల్ సేవిస్తున్నారు. అయితే మద్యం తాగేవారు ఎక్కువగా బీరకాయలను తీసుకోవడం వల్ల వారికి కాలేయ సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

 

ఎంత చెప్పినా మద్యం సేవించడం అపని వారు వారు తినే ఆహారంలో వారంలో రెండు సార్లయినా బీరకాయ ను చేర్చడం వల్ల వారి కాలేయం దెబ్బతినకుండా ఎలాంటి సమస్యలకు దారితీయకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బీరకాయలలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండటంవల్ల ఆహారం తేలికగా జీర్ణం అవ్వడంలో బీరకాయ కీలక పాత్ర పోషిస్తూ జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారం వల్ల మన శరీరంలో ఎక్కువ శాతం చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి జీర్ణక్రియ సమస్యలు తలెత్తడంతో పాటు అనేక ఇతర సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ పై బ్యాక్టీరియాలు ఇతర సూక్ష్మజీవులు అంటిపెట్టుకొని ఇన్ఫెక్షన్లకు దారి తీయటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్నవాటిలో బీరకాయ ముందు వరుసలో ఉంటుంది. ఈ బీరకాయను వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల మద్యం సేవించే వారిలో కాలేయానికి సంబంధించిన వ్యాధుల నుంచి విముక్తి పొందటమే కాకుండా ఆహారం జీర్ణం అవ్వడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here