నీటిలో నిమ్మ ముక్కలు వేసుకుని తాగితే ఏం జరుగుతుంది?

0
90

సాధారణంగా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు సక్రమంగా విధులు నిర్వహించాలి అంటే ముఖ్యంగా మన శరీరానికి కావలసినంత నీరు ఉండాలి.మన శరీరానికి తగిన మొత్తంలో నీరు ఉన్నప్పుడే మన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా విధులను నిర్వహిస్తాయి. అందుకోసమే ప్రతి రోజూ ఎక్కువ భాగంలో నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది ఈ నియమాన్ని పాటించరు.ఇప్పుడున్న బిజీ జీవితంలో తినడానికి తాగడానికి సమయం కేటాయించడం మానేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

మన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా విధులు నిర్వహించాలి అంటే ముఖ్యంగా మన శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకూడదు. మన శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే మనం తగినంత నీటిని తీసుకోవాలి.అయితే చాలామందికి పూర్తిగా నీరు తాగడం ఇష్టం ఉండదు అలాంటివారు నీటిలోకి మనకి నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని తాగడం వల్ల మన శరీరానికి కావలసినంత నీరు అందించడమే కాకుండా మరికొన్ని ఆరోగ్యప్రయోజనాలు కూడా అందుతాయి.

ఉదాహరణకు లెమన్ ఇంఫ్యూజ్డ్ వాటర్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నీటి రుచికి కూడా ఎంతో ఫ్రెష్ గా ఉండటం వల్ల ఈ నీటిని తాగడానికి ఇష్టపడతారు. లెమన్ ఇంఫ్యూజ్డ్ వాటర్ అంటే మనం తాగుతున్న నీటిలోకి నిమ్మకాయ వేసి ఓ రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచితే ఆ నీటిని లెమన్ ఇంఫ్యూజ్డ్ వాటర్ అని అంటారు.ఈ విధంగా నీటిలోకి నిమ్మకాయలు వేసుకొని తాగడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ విధమైనటువంటి నీటిని తాగటం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. అదేవిధంగా నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి కావల్సినంత విటమిన్ సి అందడంతో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. నిమ్మకాయలలో అధిక భాగం పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కనుక ఈ నీటిని త్రాగటం వల్లమన శరీర బరువును తగ్గించడానికి పూర్తిగా దోహదపడతాయి. ఈ నిమ్మకాయ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదేవిధంగా మన నోరు దుర్వాసన రాకుండా ఎంతో ఫ్రెష్ గా ఉంచడానికి కూడా నిమ్మకాయ కలిపిన నీరు సహాయపడుతుంది. కేవలం నిమ్మకాయ మాత్రమే కాకుండా పుదీనా, తులసి ఆకులు కలుపుకొని కూడా నీటిని తాగవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here