హైదరాబాద్: గత మూడు రోజులుగా ఎండల నుంచి ఉపశమనం పొందిన నగరవాసులకు వర్షం తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. నేడు మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి, నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో గంటపాటు కురిసిన కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

నగరంలో భారీ వర్షం, ట్రాఫిక్ జామ్
మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లతో పాటు నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ నదులను తలపించాయి. ఈ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్ తీవ్రస్థాయికి చేరుకుంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్‌లలో, అమీర్‌పేట్, కూకట్‌పల్లి జంక్షన్లలో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
#HYDTPinfo #RainAlert
— Hyderabad Traffic Police (@HYDTP) August 4, 2025
Due to heavy #Rain and #waterlogging at Shaikpet nala flyover, traffic movement is slow.
Commuters, please take alternate routes to avoid congestion.
Tolichowki Traffic Police ensures smooth traffic flow. #HyderabadRains #Monsoon2025 pic.twitter.com/yip9o3IBoC
రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు
రాబోయే ఐదు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వర్షం సమయంలో అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది.
HyderabadRains WARNING 2⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) August 4, 2025
Dear people of Hyderabad. It's going to be DANGEROUS THUNDERSTORM for entire Hyderabad City. I'm repeating it again. Please stay indoors. Massive CUMULONIMBUS is developing. 50mm expected in very short time. Please STAY ALERT ⚠️⚠️⚠️































