Chiranjeevi: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో భాగంగా ఈయన గాజువాక భీమవరం నుంచి పోటీ చేశారు అయితే ఆ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు అయితే ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు.

ఇక పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ పరిస్థితి చాలా కఠినంగా ఉందని చెప్పాలి. ఈయనకు పోటీగా మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ నేత వంగా గీత పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఇద్దరి మధ్య కఠినమైనటువంటి పోటీ ఉంది. అయితే తన తమ్ముడికి గెలుపు కోసం ఇప్పటికే సినీ సెలబ్రిటీలు అందరూ కూడా పిఠాపురంలో మోహరించిన సంగతి తెలిసిందే.
మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా ఈయనకు మద్దతు తెలియజేస్తూ సినిమా సెలబ్రిటీలందరూ పోస్టులో చేస్తున్నారు. ఇక చిరంజీవి సైతం తన తమ్ముడి గెలుపు కోసం ఒక వీడియోని షేర్ చేస్తూ ప్రజలందరూ కూడా తన తమ్ముడిని గెలిపించాలని కోరారు అయితే ఈ వీడియో పై భారీ స్థాయిలో నెగిటివ్ కామెంట్లు రావడంతో పవన్ గెలుపు కష్టమని తెలుస్తుంది.
ఇలా చిరంజీవి షేర్ చేసినటువంటి ఈ వీడియో పై నేటిజన్స్ స్పందిస్తూ ఒకప్పుడు మీ కన్నతల్లిని బూతులు తిట్టినటువంటి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని కూటమికి మద్దతు తెలుపుతున్నావా అన్న అంటూ కొందరు కామెంట్ చేస్తూ చంద్రబాబు నాయుడు తన తల్లిని తిట్టిన వీడియోని కూడా షేర్ చేశారు.
శాశ్వతంగా ఇంట్లోనే..
మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఎవరు ఓడించాల్సిన అవసరం లేదు టిడిపి వాళ్ళే అక్కడ ఓడిపోయేలా చేస్తారు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మరి కొద్ది రోజులు ఆగండి అన్న ఇక మీ తమ్ముడు శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉంటారు ఆయన గెలవడం కష్టం. ఎంచక్కా సినిమాలు చేసుకోవచ్చు అంటూ చిరంజీవి వీడియో పై చాలా మంది నెగిటివ్ గా కామెంట్లు చేస్తూ పోస్టులు చేయడంతో జనసేన కార్యకర్తలలో ఆందోళన నెలకొంది.





























