Kajal Agarwal: సినీనటి కాజల్ అగర్వాల్ త్వరలోనే సత్యభామ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల పెళ్లి చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చినటువంటి కాజల్ అగర్వాల్ కొంత కాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న కాజల్ త్వరలోనే సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా రాబోతున్నారు. ఈ సినిమాలో ఈమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ సినిమా జూన్ ఏడో తేదీ రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఇండస్ట్రీ అలాగే నార్త్ ఇండస్ట్రీకి చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు పెళ్లయితే అసలు నచ్చదని వాళ్ళను పూర్తిగా పక్కన పెట్టేస్తారని తెలిపారు.
సౌత్ ఇండస్ట్రీ మారాలి..
ఇక నార్త్ ఇండస్ట్రీలో అలా లేదని అక్కడ పెళ్లయిన హీరోయిన్లు కూడా ఇప్పటికీ నటిస్తున్నారని ఈ విషయంలో సౌత్ ఇండస్ట్రీ ఇంకా మారాల్సి ఉందని కాజల్ తెలిపారు. సౌత్ ఇండస్ట్రీలో ఒక్క నయనతారకు మినహా అందరి హీరోయిన్ల పరిస్థితి అలాగే ఉంది అంటూ కాజల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























