ఈ ఫుడ్ తింటే మూడ్ బాగుంటుందట.. ఏదంటే?

0
141

సాధారణంగా కొందరు ప్రతి పది నిమిషాలకు ఒకసారి వారి మూడ్ మార్చుకుంటూ ఉంటారు. ఎంతో ఆనందంగా గడుపుతున్న సమయంలోనే ఉన్నఫలంగా చిరాకు పడుతుంటారు. ఈ విధంగా మనలో మూడు స్వింగ్ మారుతూ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. లేకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.

మనలో ఈ విధంగా మూడ్ స్వింగ్ అవడానికి గల కారణం ఎండోర్ఫిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్. ఈ హార్మోన్ మనకు ఎంతో సంతోషాన్ని అందిస్తుంది. ఈ విధమైనటువంటి హ్యాపీ హార్మోన్ మనకు ఎక్కువగా ఆహారం నుంచి లభిస్తుంది. కనుక మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే తప్పకుండా ఎండార్ఫిన్ హార్మోన్ కలిగిన ఆహారపదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఎండార్ఫిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం..

ఎండోర్ఫిన్ అనే హార్మోన్ సహజంగా మనకి అశ్వగంధ, మిరియాలు, మిర్చి వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా బెర్రీస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డిప్రెషన్ చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బెర్రీస్ లో ఎక్కువ భాగం యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనలో ఉన్న డిప్రెషన్ తరిమికొట్టి మనల్ని ఎంతో ఆనందంగా ఉండడానికి దోహదపడుతుంది.

డార్క్ చాక్లెట్స్ కూడా మన మూడ్ ను స్వింగ్ చేయడానికి ఎంతగానో దోహదపడతాయి.డార్క్ చాకోలెట్ ఎండోర్ఫిన్స్ అనే ఒక కెమికల్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. దీని ద్వారా మన మెదడు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. మనం నిత్యం ఆనందంగా గడపాలంటే సాల్మన్ చేపలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ చేపలలో ఉండేటటువంటి ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు మన మూడ్ ను స్వింగ్ చేయడానికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here