డ్రైవింగ్ లైసెన్స్ ఆన్ లైన్ లో రెన్యువల్ చేసుకునే ఛాన్స్.. ఎలా అంటే..?

0
364

దేశంలోని చాలామంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ చాలా రోజుల క్రితమే ముగిసింది. అయితే కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఆన్ లైన్ లోనే సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. parivahan.gov.in వెబ్ సైట్ ద్వారా సులభంగా లైసెన్స్ ను రెన్యువల్ చేసుకొవచ్చు.
అయితే ఆన్ లైన్ లో డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకున్నా రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ కు వెళ్లి ఫింగర్ ప్రింట్ వేయాల్సి ఉంటుంది. వెబ్ సైట్ లో డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసెస్ ఆప్షన్ ను ఎంచుకుని లైసెన్స్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవచ్చు. ఆ తరువాత డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేయించుకోవడం కోసం అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.

ఆన్ లైన్ లో డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసిన చేసిన తరువాత రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ లో స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయంలో వెళ్లి బయోమెట్రిక్స్ ఇవ్వాలి. బయోమెట్రిక్స్ సరిపోలితే ఆ తరువాత డ్రైవింగ్ లైసెన్స్ అటోమేటిక్ గా రెన్యువల్ అవుతుంది. 40 సంవత్సరాలు దాటిన వాళ్లు డాక్టర్ సర్టిఫికెట్ ను కూడా జత చేయాల్సి ఉంటుంది. వాలిడిటీ అయిపోయిన తరువాత నెల రోజుల కంటే ఆలస్యంగా లైసెన్స్ రెన్యువల్ చేయించుకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

డ్రైవింగ్ లైసెన్స్ ను ఎంటర్ చేయాలని అనుకునే వాళ్లు ఫామ్ డి ని కూడా సమర్పించాలి. ఈ విధంగా సులభంగా ఆన్ లైన్ లో లైసెన్స్ ను రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here