కార్తీకదీపం ఈ సీరియల్ పేరు వినగానే ప్రేక్షకులు ఎంతో సంబరపడతారు. ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్ లో నటించే వారిని పొరపాటున ఏమైనా అన్నామంటే ఇక అంతే సంగతులు. అదేవిధంగా ఈ సీరియల్ లో ముఖ్యంగా డాక్టర్ బాబుకు, దీపకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదివరకు కార్తీక్ దీపను నానా హింసలు పెట్టాడు. ఈ క్రమంలో ఏకంగా డాక్టర్ బాబుకు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు కూడా వచ్చాయంటే ఈ సీరియల్ ఏ స్థాయిలో అభిమానులను సంపాదించుకుందో ఇట్టే తెలిసిపోతుంది.

ఇక ఈ సీరియల్ లో నటించే మోనిత, సౌందర్య, ఆదిత్య, భాగ్యం పాత్రలకు కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సౌందర్య పాత్రలో నటిస్తున్న టువంటి అర్చన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సీరియల్ లో అర్చన డాక్టర్ బాబు కు తల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సీరియల్లో వీరిద్దరి మధ్య తల్లీకొడుకుల అనుబంధం చూస్తే నిజజీవితంలో కూడా తల్లీకొడుకులు ఏమో అన్నట్టుగా వీరి నటన ఉంటుంది. ఈ సీరియల్ లో అర్చన అలియాస్ సౌందర్యను చూడగానే అందరూ ఈమెకు సుమారుగా 40 సంవత్సరాలు పైబడి ఉంటాయని భావిస్తారు. కానీ నిజజీవితంలో ఆమె వయస్సు తెలిస్తే అందరూ షాక్ అవుతారు.
ఈ సీరియల్ లో నిరుపమ్ , అర్చన మధ్య వయసు తేడా తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు..తల్లి కొడుకు పాత్రలు చేస్తున్నారంటే కనీసం వీరిమధ్య కొన్ని సంవత్సరాలు వయసు తేడా ఉంటుందని భావిస్తాము. కానీ వీరిద్దరి మధ్య కేవలం నెలలు మాత్రమే వయసు తేడా ఉన్నాయని తెలిస్తే నిజంగానే ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అర్చన 1988 జనవరిలో జన్మిస్తే.. డాక్టర్ బాబు అదే ఏడాది చివరిలో జన్మించాడు. వీరిద్దరి మధ్య కేవలం నెలలు మాత్రమే వయసు తేడా. ఈ విధంగా వీరిద్దరి మధ్య వయసు నెలల వ్యత్యాసం అని తెలియడంతో అభిమానులు ఎంతో షాక్ అవుతున్నారు.






























