2020 సంవత్సరం చివరి చంద్ర గ్రహణం రేపు ఏర్పడనున్న సంగతి తెలిసిందే. మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే పాక్షికంగా చంద్ర గ్రహణం కనిపిస్తుంది. రేపు ఏర్పడబోయే గ్రహణాన్ని ఉపఛాయ గ్రహణం అని అంటారు. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజునే చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. చాలా అరుదుగా మాత్రమే కార్తీక పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

చంద్ర గ్రహణం రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దానాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 1 : 04 గంటలకు గ్రహణం ప్రారంభం కానుండగా సాయంత్రం 5 : 22 గంటలకు గ్రహణం ముగియనుంది. రేపు కనిపించే చంద్రుడు సాధారణంగా కనిపించేంత ప్రకాశవంతంగా కాకుండా కొంచెం మసకగా కనిపిస్తాడు. అయితే ఉపఛాయ చంద్రగ్రహణాన్ని గ్రహణంగా శాస్త్రాల ప్రకారం పరిగణించరు.
అందువల్ల చంద్రగ్రహణం సమయంలో ఆలయ తలుపులను మూసివేయరు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉన్న సమయంలో భూమి అడ్డుకోవడం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతుంది. మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, ఆసియా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చంద్ర గ్రహణం కనిపిస్తుంది.
ఈ గ్రహణం వల్ల మేషరాశి వారికి ఆర్థిక సమస్యలు, వృషభ రాశి వారికి ఆరోగ్య సమస్యల నుంచు ఉపశమనం, మిధున రాశి వారికి ఖర్చులు తగ్గడం, కర్కాటక రాశి వారికి ఉన్నతాధికారులచే ప్రశంసలు, సింహ రాశివారికి మంచి లాభాలు, కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, తులారాశివారికి సవాళ్లు ఏర్పడటం, వృశ్చికరాశి వాళ్లు జీవిత భాగస్వామి నుంచి మద్దతు, ధనుస్సు రాశి వారికి మంచి లాభాలు, మకరరాశి వారికి ఆర్థిక ప్రయోజానాలు, కుంభరాశి వారికి పరిస్థితులు మెరుగుపడటం, మీనరాశి వారికి కెరీర్ పరంగా బాధ్యత పెరగడం జరుగుతాయి.






























