Hero Abbas: ప్రేమదేశం సినిమా ద్వారా తెలుగు తమిళ భాషలలో ఎంతో ఫేమస్ అయ్యారు నటుడు అబ్బాస్.ఈయన తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి తక్కువ సమయంలోనే గుర్తింపు పొందారు. అయితే తెలుగులో ఈయన వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకోవడంతో పెద్దగా సినిమాలు చివరికి సెకండ్ హీరోగా మిగిలిపోయారు.

తెలుగు చిత్ర పరిశ్రమలు కొంతకాలం పాటు కొనసాగిన అబ్బాస్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు దూరమై విదేశాలలో మోటివేషనల్ క్లాసెస్ చెబుతున్నారు. ఇకపోతే అడ్వర్టైజ్మెంట్ లో కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇలా హీరోగా సందడి చేసిన అబ్బాస్ చిత్ర పరిశ్రమకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులను సందడి చేసేవారు.
ఇదిలా ఉండగా తాజాగా అబ్బాస్ హాస్పిటల్ బెడ్ పై ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారింది. దీంతో అభిమానులు అసలేం జరిగింది అంటూ ఆందోళన చెందారు. అయితే అబ్బాస్ తన కుడి కాలికి సర్జరీ జరిగిందనే విషయాన్ని వెల్లడించారు.

కుడి కాలి లిగ్మెంట్ సమస్య కారణంగా సర్జరీ…
నా కుడి కాలికి లిగ్మెంట్ లో ఏర్పడిన సమస్య కారణంగా సర్జరీ జరిగింది. నేను హాస్పిటల్ బెడ్ పై ఉన్నప్పుడు నా మనసు ఏమాత్రం ప్రశాంతంగా లేదు. కానీ లోలోపలే నా భయాన్ని అధిగమించడానికి ఎంతో ప్రయత్నం చేశాను. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లానని తెలియచేయడమే కాకుండా హాస్పిటల్లో ఉన్న సమయంలో నాకోసం ప్రార్ధించిన ప్రార్థిస్తూ ఉన్నటువంటి అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.



























