Hero J.D. Chakravarthy : శివ సినిమాతో తెలుగులో పరిచయమైన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి కంటే జేడి చక్రవర్తి అనగానే ప్రేక్షకులు గుర్తిస్తారు. మొదటి సినిమా క్యారెక్టర్ పేరును తన పేరులో పెట్టుకున్న జేడి చక్రవర్తి శివ, సత్య, దెయ్యం, ఎగిరే పావురమా, మనీ, మనీ మనీ అంటూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గురువు ఆర్జీవి బాటలో హిందీలో అనేక సినిమాల్లో నటించిన జేడీ, అటు తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించారు. అలాగే దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకు చేసారు. తాజాగా యుట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నన్ను చంపాలని చూసింది…
చక్రవర్తి గారు ఎపుడు సినిమాల గురించి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే తన తల్లి గురించి ఎక్కువగా చేప్తారు. తనకు పదమూడేళ్ల వయసులో తండ్రి చనిపోతే తన తల్లే పెంచిందని చెప్పారు. కోట్ల ఆస్తులు ఉన్నా లీగల్ వారసత్వం ప్రూవ్ చేసుకునే వరకు మా చేతికి రాలేదు. మా నాన్న ఉన్నంత వరకు పెద్ధ బంగ్లా లో ఉన్న మేము ఆయన మరణించాగానే ఒక సింగల్ రూమ్ లోకి మారాము. అమ్మ కాలక్షేపానికి చేసిన ఉద్యోగం మాకు అన్నం పెట్టింది. ఆకలి విలువ, డబ్బు విలువ అన్ని అప్పుడే తెలిసాయి అంటూ చెప్పారు చక్రవర్తి.

ఇక మొదటి సారి ఆయన జీవితంలో చావు అంచుల దాక వెళ్లిన సంఘటన గురించి చక్రవర్తి వివరించారు. నా భార్య నాకు తెలియకుండా కషాయం రోజు తాగు అంటూ ఇచ్చేది. తను అందులో విషం కలిపిన విషయం నాకు తెలియలేదు. ఒకరోజు నా దగ్గర పనిచేసే, నాకు బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆ కషాయం తాగి వాంతులు చేసుకున్నాడు. అప్పటికి నాకు అనుమానం రాలేదు. తనకే వెళ్లి ఇలా జరిగిందనీ చెబితే నీకోసం చేసే కషాయం వేరేవాళ్లకి ఇస్తావా అంటూ ఫైర్ అయింది . ఇక మెల్లగా నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవడంతో చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. అయితే నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా అనారోగ్య సమస్యలు లేకపోయినా ఎందుకు ఇలా అయిందని బాధపడ్డాను. 99% మరణిస్తానని ఖచ్చితంగా అనుకున్నాక ఒక డాక్టర్ నాకు మాదక ద్రవ్యాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి స్లో పాయిజన్ ఇస్తున్నట్లు నిర్ధారించారు. అలా నేను తాగే కషాయంలో నా భార్య విషం కలుపుతున్నట్లు అర్థమైంది అని చాలా కొద్ది మందికి మాత్రమే ఈవిషయం తెలుసనీ చెప్పారు.
































