Hero Jagapathi Babu : కుటుంబం కథా చిత్రాల హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు అప్పట్లో శోభన్ బాబు గా పేరు తెచ్చుకున్నాడు. ఇద్దరు హీరోయిన్లు, లేదా మొగుడు పెళ్ళాల కాన్సెప్ట్ తో సినిమా ఇలా మహిళా ప్రేక్షకులను ఎక్కువ సొంతం చేసుకున్న జగపతి బాబుకి ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోల్లా కాదు ముక్కుసూటిగా ఉన్నది మాట్లాడేస్తాడు. తన గురించైనా సరే లోపాలను చెప్తాడు. ఇక ఒకరిని పొగుడుతూ ఉండటం, భజన చేయడం రాదు కాబట్టే ఇండస్ట్రీలో పెద్దగా నన్ను ఎవరూ పట్టించుకోలేదు అంటూ చెప్పే జగపతి బాబు తనకు ఉమెన్ అంటే ఇష్టం కానీ విమెనైజర్ కాదు అంటూ ఘాటుగా చెప్పేస్తాడు. 60 ఏట అడుగుపెట్టిన జగపతి బాబు గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన ఫ్యామిలీ గురించి అలాగే సినిమాల గురించి మాట్లాడారు.

నా రెమ్యూనరేషన్ ఎంతంటే…
జగపతి బాబు గారు మొదటి నుండి సినిమా నచ్చితే చేయటమే కానీ రెమ్యూనరేషన్ ఇంత ఉండాలి అనే నియమం పెట్టుకొకపోవడం వల్ల ఇప్పటికీ తనను తక్కువ డబ్బులు ఇచ్చినా వచ్చి చేస్తాడులే అన్నట్లుగా చులకనగా చూస్తారు అంటూ జగపతి బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. తన వ్యక్తిగత ఖర్చులన్నీ తానే పెట్టుకోవడం మొదటి నుండి జగపతి బాబు కి అలవాటు ఉందట. నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా కేవలం తన నటనకు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకునే వాడట జగ్గు బాయ్. ఇక తాను హీరోగా సంపాదించిన దాని కంటే విలన్ గానే ఎక్కువ సంపాదిస్తున్నట్లు తెలిపారు. అయితే అప్పుడు ఇప్పుడు లెక్కలు వేసుకోకపోవడం వల్ల వస్తున్నది పోయేది పెద్దగా తెలియదంటూ చెప్పారు. హీరోగా చేసేటపుడు డేట్స్ ఎక్కువగా ఇవ్వాలి ఇప్పుడు విలన్ గా చేస్తున్నపుడు ఎక్కువ రోజులు పని ఉండదు కానీ ఇప్పుడు వర్క్ లో వేస్టెజ్ కూడా ఎక్కువుంటుంది. అలా చూసుకుంటే రెండూ సమానం అయిపోతాయి అంటూ చెప్పారు. అయితే చాలా సినిమాలలో రెమ్యూనరేషన్ ఇవ్వలేమంటూ చేతులెత్తేసినా చేసినవి ఉన్నాయి.

అలా చేయడం వల్లే ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో తక్కువ డబ్బులు ఇచ్చిన నా జగపతి బాబు వస్తాడులే అనే చులకన భావం ఉంది అంటూ చెప్పారు. ఇక పెద్ధ సినిమాల్లో 200 కోట్ల బడ్జెట్ లో హీరోలకు కొంతమందికి పర్సెంటేజ్ ఇస్తున్నపుడు విలన్ గా చేస్తున్న నాకు ఒక 3% ఇవ్వమని అడగడంలో తప్పులేదనిపించింది అంటూ చెప్పారు. ఇక తనని సినిమాలో తీసుకున్నాక చెప్పకుండా వేవవారిని పెట్టుకున్నప్పుడూ కనీసం నాకు ఒక మాట కూడా చెప్పనప్పుడు హర్ట్ అయ్యాను, అలా రెండు మూడు సినిమాలలో జరిగింది అంటూ జగపతి బాబు తెలిపారు. అలా అని నా సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకోలేను అంటూ అవకాశాలు ఎవరినీ అడగను అంటూ చెప్పారు.































