అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్ !

0
1265

ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ ఒక ఇంటివాడు అయ్యాడు. తాజాగా తన ప్రియురాలు లోహిత రెడ్డి ని పెళ్లి చేసుకొని వివాహ జీవితంలో కి అడుగు పెట్టారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వివాహ వేడుకకు ఎవరెవరు హాజరయ్యారు? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ వివాహ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,అల్లు అరవింద్, తనికెళ్ల భరణి, అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్ళికొడుకు గెటప్ లో హీరో కార్తికేయ మెరిసిపోతున్నాడు. పెళ్లి కూతురు రోహిత రెడ్డి రెడ్డి కూడా బంగారు రంగు దుస్తులలో వాటికి తగ్గట్టుగానే జ్యువెలరీ వేసుకుని మెరిసిపోయింది.

కార్తికేయ తను ప్రేమించిన అమ్మాయిని మూడుముళ్ల బంధంతో తన వశం చేసుకున్నారు. నేడు హైదరాబాదు లోని ఒక ఫంక్షన్ హాల్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.ఇది ఇలా ఉంటే ఇటీవలే కార్తికేయ తాను హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ప్రియురాలు, కాబోయే భార్య లోహిత రెడ్డిని తన అభిమానులకు పరిచయం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.

పెళ్లి దుస్తులలో వధూవరులు మెరిసి పోతున్నారు.కార్తికేయ లవ్ స్టోరీ గురించి మనందరికీ తెలిసిందే. రాజా విక్రమార్క ఈవెంట్లో వారిద్దరూ వివాహ బంధంతో ఏకం అవుతున్నట్లు వెల్లడించిన సంగతి మనందరికీ తెలిసిందే. మొత్తానికి కార్తికేయ తాను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి ఒక ఇంటివారయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్ !

అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్ !

అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్ !

అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్ !